3 July, 2026 | 9:52 PM

Breaking News

ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •  

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

28-06-2025 11:00 PM

కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు 

మహబూబాబాద్, జూన్ 27 (విజయ క్రాంతి):  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కుమ్మరి కుంట్ల నాగన్న , పర్వత కోటేష్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ అధికారికి జూలై 9న చేపట్టనున్న సార్వత్రిక సమ్మె నేపథ్యంలో విధులకు హాజరుకామని సమ్మె నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని దినాన్ని కాపాడుకోవాలని, అంగన్వాడి, ఆశ, మున్సిపల్ గ్రామపంచాయతీ, ఐకెపి, వివోఏ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులు, కష్టజీవులు, విద్యార్థులు, మేధావులు, రైతులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సారయ్య, రాములు, జనార్ధన్, రవి, హేమ, వెంకన్న, ప్రవీణ్, సుధాకర్ పాల్గొన్నారు.