3 July, 2026 | 10:43 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

కాసిపేట పోలీస్ స్టేషన్ డీసీపీ భాస్కర్ విజిట్

27-06-2025 11:48 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని  కాసిపేట  పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్ శనివారం ఆకస్మికoగా సందర్శించారు. డీసీపీ భాస్కర్ మంచిర్యాల నుంచి నేరుగా కాసిపేట  పోలీస్ స్టేషన్ కీ వచ్చారు. బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ తో కలిసి ఆయన పోలీస్ స్టేషన్ విజిట్ చేశారు. డీసీపీ భాస్కర్  ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ ను సిబ్బంది వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సిబ్బంది విధుల గురించి  వాకబ్ చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.