20 May, 2026 | 3:45 AM

సమావేశాన్ని విజయవంతం చేయండి

20-05-2026 01:24 AM

బీఆర్‌ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే మాధవరం పిలుపు

కూకట్‌పల్లి, మే 19 (విజయక్రాంతి): కూకట్‌పల్లిలో ఈ నెల 25న జరగనున్న నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాన్ని విజయం వంతం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కేపిహెచ్‌బి కాలనీ, బాలాజీనగర్ డివిజన్‌ల ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతుందని కార్యకర్తలు గమనించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినా కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా వారు చేసిందేం లేదన్నారు. ఈ నెల 25నకేటీఆర్ అధ్యక్షతన జరగనున్న కూకట్‌పల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల  సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.