బక్రీద్ పండుగను సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలి
కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, మే 19 (విజయక్రాంతి): బక్రీద్ పండుగ ను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బక్రీద్ పండుగను సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మసీదులు, ఈద్గాలు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పండుగ సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో, సామాజిక బాధ్యతతో వ్యవహరించి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహ రెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు ఎమ్మార్వో హిమబిందు, రెవెన్యూ అధికారులు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.






