జాతీయ లోక్‌అదాలత్‌ను జయప్రదం చేయండి
న్యాయమూర్తి స్వరూప కాటం
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో మంగళవారం ఇల్లందు మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో ఇల్లందు కోర్టు పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్ ఎస్. హెచ్. ఓ. లతో కో ఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి స్వరూప కాటం ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఈనెల 20న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా అందరూ ఎస్. హెచ్. ఓ. లు బాధ్యతగా సహకరించి రాజి పడదగిన కేసులను ఇరువర్గాల సమన్వయ పరిచి, ఆయా స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి, పెద్ద మొత్తంలో కేసులు రాజీ పడే విధంగా కృషి చేసి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జడ్జితో పాటు, కోర్టు సూపర్డెంట్ రామకృష్ణ, ఇల్లందు కోర్టు పరిధిలోగల పోలీస్ స్టేషన్ ఎస్. హెచ్. ఓ. లు కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






