ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డోజర్
కుమారుడు మృతి.. తండ్రికి గాయాలు
బూర్గంపాడు, జూన్9 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనాన్ని డోజర్ ఢీకొనగా కుమారుడు మృతిచెందగా తండ్రికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని సారపాక చందు బజార్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ మేడ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం పాత సారపాకకు చెందిన చెలికాని ప్రవీణ్, గణేష్ లు తండ్రీకొడుకులు చందు బజార్లో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా మోతే పట్టీనగర్ వైపు నుంచి వస్తున్న డోజర్(బుల్) ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెలికాని గణేష్(15) అక్కడికక్కడే మృతిచెందగా తండ్రి ప్రవీణ్ కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం తరలించారు. మృతుడి బాబాయ్ చెలికాని లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






