calender_icon.png 16 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న రాష్ట్ర బంద్ విజయవంతం చేయండి

16-10-2025 07:24:00 PM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు

మందమర్రి  (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపును పట్టణంలో విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు అధ్యక్షులు సకినాల శంకర్ కోరారు. పట్టణం లోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్పత్తి, ఉత్పాదక  కులాలుగా ఉన్న బీసీలను ఎన్నో ఏళ్లుగా అగ్రవర్ణాలు అణిచివేస్తూ, బీసీల హక్కులను కాల రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. అగ్రవర్ణాల కుట్రల వల్ల రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీఓ జారీ చేయగా,అగ్రవర్ణాలు బీసి రిజర్వేషన్లు అడ్డుకునేందుకు హైకోర్టు కు వెళ్లగా రిజర్వేషన్ల అమలుపై స్టే ఇవ్వడం జరిగిందని, అగ్రకులాల కుట్ర మూలంగానే బిసి రిజర్వేషన్లు నిలిచి పోయాయని ఆయన అగ్రవర్ణాల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

చట్టసభలతో పాటు విద్యా ఉపాధి వంటి అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి నపుడే బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, బీసీ హక్కుల కోసం జరిగే పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని కోరారు.

బీసీ హక్కుల సాధనలో భాగంగా  ఈనెల 18 న జరగనున్న రాష్ట్ర వ్యాప్త బంద్  పిలుపులో అన్ని కుల సంఘాలు, విద్యార్థి, కార్మిక, కర్షక, వ్యాపార, ఆటో, మహిళా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించి బంద్ ను విజయవంతం చేయాలని అంతే కాకుండా పట్టణంలో చేపట్టనున్న నిరసన ర్యాలీ లో అన్ని కుల సంఘాలు పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, గౌరవ అధ్యక్షులు పోలు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల సతీష్ బాబు, ముఖ్య సలహాదారులు రాంసాని శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బేర వేణుగోపాల రావు, ఉపాధ్యక్షులు దేవరపల్లి ప్రభాకర్, వై రాజు, ఆర్గనైజ్  సెక్రెటరీ లు జమాల్ పూరి నర్సోజి, ఎగ్జిక్యూటింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్ల సారంగపాణి, మునిశెట్టి సత్యనారాయణ, పోలు సంపత్, పోల్ కుమార్, నరసింహచారి, రాయబారపు వెంకన్న, సముద్రాల శ్రీనివాస్, తరిగొప్పుల సంపత్ లు పాల్గొన్నారు.