calender_icon.png 17 October, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ డైరీలకు దీటుగా విజయ డైరీ ప్రొడక్టులను పెంచుతున్నాం

16-10-2025 07:27:50 PM

పాల వెలువకు పలు కొత్త పథకాలు

సర్కార్ ప్రోత్సాహం తో ముందుకెళ్తున్నాం

ప్రైవేట్ డైరీలకు దీటుగా విజయ డైరీలో పలు నూతన పథకాలు 

రాష్ట్రంలో కొత్తగా 200 బీఎంసీలు ఏర్పాటు

కొత్తగా విజయ డైరీ పాల ఉత్పత్తి, అమ్మకం, కేంద్రాలు ఏర్పాటు

విజయ డైరీ రైతులకు మరిన్ని సదుపాయాలు

విజయ డైరీ జనరల్ మేనేజర్ కామేష్

కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో విజయ డైరీ ఉత్పత్తులను ప్రైవేట్ డైరీ లకు దీటుగా పోటీపడుతున్నట్లు విజయ డైరీ జనరల్ మేనేజర్ కామేష్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజయ డైరీని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రవేట్ డైరీలకంటే ప్రభుత్వ సహకారంతో విజయ డైరీలో పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 300 బిఎంసిలు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయ డైరీ రైతులకు అన్ని రకాలుగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ డైరీలకంటే నాణ్యతమైన పాలు ఇతర ఉత్పత్తులు విజయ డైరీలో లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో నీ రైతులు పాల ఉత్పత్తి చేపట్టి స్థానికంగా ఉన్న విజయ పాల కేంద్రాల్లో పాలు పోస్తున్నారన్నారు. ప్రైవేటు పాల డైరీలు వచ్చి గ్రామాల్లో రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయని వారి మోసపూరిత విషయాలను రైతులు నమ్మవద్దని కోరారు. మంచి పాలకు ఎక్కువ రేటు విజయపాల కేంద్రాల్లోని లభిస్తాయని రైతులకు విశ్వాసం ఉందని తెలిపారు. 

ప్రైవేట్ డైరీలకు దీటుగా విజయపాలను ఉత్పత్తి చేయడానికి పలు కొత్త పథకాలను  పాలతో పాటు పాల ఉత్పత్తి పదార్థాల అమ్మక కేంద్రాలను ప్రవేశపెట్టడానికి కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నామని విజయ డైరీ జనరల్ మేనేజర్ కామేష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడి సెంటర్లకు, గర్భిణీలకు, ప్రభుత్వ హాస్టళ్లకు, గురుకులా లకు, దేవాలయాల్లో విజయ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు విజయ పాలన వెన్న నెయ్యిని అందించే అవకాశాలు ఉన్నాయన్నారు. గతంలో కంటే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సంస్థలకు పాలను, నెయ్యిని,సరఫరాలను చేస్తూ  300 కోట్ల ఆదాయం పెంచుకున్నామని తెలిపారు. ప్రభుత్వం సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడి కేంద్రాలు, గురుకులాలు, హాస్టల్ లలో  విజయ పాలను,  టెట్రాపాలను సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి  అమలు చేస్తున్నామన్నారు. విజయ పార్లర్, పాల ఉత్పత్తులను అమ్మకం చేయడానికి హైదరాబాదులో ఇప్పటికే వంద పార్లలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వాస్తవ్యాప్తంగా మరో 200 పార్లర్లను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాకుండా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి ప్రజలకు అందించాలని ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వం ద్వారా విజయ పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ విజయ పాలకు రైతుల కు మేలు చేసినట్లేనని ప్రజలు గ్రహించాలని తెలిపారు. స్వచ్ఛమైన పాలు విజయ పాల ని అన్నారు. పాల ఉత్పత్తి చేస్తున్న పాడి రైతులకు ఎలాంటి బకాయిలు లేకుండా బిల్లులు చెల్లించామని ఇప్పటివరకు పాత ఇన్సెంటివ్ బకాయిలను కూడా చెల్లించామని జనరల్ మేనేజర్ కామేష్ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఆర్థిక సహాయంతో విజయ డైరీ ఉత్పత్తులను పార్లర్లను  ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ సిటీలో ఒక్కో పార్లర్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు జిల్లాలలో ఐదన్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. పాల ఉత్పత్తులను అమ్మడానికి ఏర్పాటు చేసే కేంద్రాల బ్లూ ప్రింట్ తయారు చేసామని, పాడి రైతులు కూడా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని జనరల్ మేనేజర్ తెలిపారు.

నష్టాలలో ఉన్న బీఎంసీలను పాల ఉత్పత్తి పెంచడానికి  ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అవసరం ఉన్న మండలాలలో మరిన్ని బిఎంసిల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నారు. 1000 లీటర్లు పాలను ఉత్పత్తి చేసేg గ్రామాలలో పాడి రైతులకు మరింత ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కామారెడ్డి నిజామాబాద్ రెండు జిల్లాలను కలిపి మిల్క్ షెడ్ లో పాల ఉత్పత్తి పెంచడానికి కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మిల్క్ షెడ్ మరింత విస్తరించడానికి పాల ఉత్పత్తి పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల భాగంగా గురువారంనాడు కామారెడ్డి జిల్లా కేంద్రానికి రావడం జరిగిందని మరిన్ని సౌకర్యాలు పాల ఉత్పత్తి పెంచి కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నట్లు  రైతులు కూడా పాల ఉత్పత్తికి సహకరించాలని కోరారు. పాల ఉత్పత్తి పెంచడానికి సిబ్బందినీ వివిధ గ్రామాలకు పంపించి రైతులకు అవగాహన కల్పించి పాల ఉత్పత్తి పెంచే విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో డిడి నాగేశ్వరరావు, విజయ పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.