calender_icon.png 20 June, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి

19-06-2025 06:17:55 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని, యోగాను కొంత సమయం కేటాయించుకోవాలని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని టి.జి.డబ్ల్యూ.ఆర్.ఎస్. & బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి.యాదగిరి అన్నారు. గురువారం అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకలు(International Yoga Decade Celebrations) పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని టి.జి.డబ్ల్యూ.ఆర్.ఎస్. & బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన యోగ, ఆయుర్వేదిక్ వైద్య శిబిరానికి అడ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యురాలు శిల్పా మోహన్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ... ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరు నిత్యం యోగా కొరకు కొంత సమయం కేటాయించుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ సిబ్బంది శంకర్, గౌతమి, యోగా శిక్షకులు జీవన్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.