23 June, 2026 | 1:48 AM

కనుల దారి.. నీవైపే చేరే సుందరి

23-06-2026 12:56 AM

తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ తొలిసారిగా ‘ఓ..! సుకుమారి’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు. మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఝాన్సీ, ఆమని, ఆనందకోట జయరామ్ ముఖ్యపాత్రలు పోషించారు.

తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెడుతూ, ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘హే ఓ సుకుమారి కనుల దారి.. నీవైపే చేరే సుందరి..’ అంటూ సాగుతోందీ పాట. భరత్ మంచిరాజు స్వరపరిచిన ఈ పాటను పూర్ణాచారి రాయగా, అభిజిత్ రావు పాడారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: భరత్ మంచిరాజు; డీవోపీ: సీహెచ్ కుషేందర్; ఎడిటర్: శ్రీవరప్రసాద్; ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి.