గుండె కుడివైపా..? ఎడమవైపా..!
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘చిరంజీవి’. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 28న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర స్నీక్ పీక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ స్నీక్ పీక్ ఎలా ఉందో చూస్తే.. చిరంజీవి అనే యువకుడు డెక్ట్స్రోకార్డియా (కుడివైపు గుండె ఉం డే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్. ఈ జంట సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమ వైపునకు గుండె లయను గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్. ఈ ట్విస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చివరలో గ్రే షేడ్‌లో హీరోను చూపించారు. ప్రేక్షకులను ఆకర్షించే అన్ని అంశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా సంగీతం: శేఖర్ చంద్ర; డీవోపీ: రామకృష్ణ; ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్.






