5 August, 2026 | 1:28 AM

పాండిచ్చేరిలో భారీ యాక్షన్

05-08-2026 12:00 AM

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం పనిచేస్తున్నారు. ‘రాపో23’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో రామ్.. కథానాయకుడిగా నటిస్తుండటమే కాక ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరిస్తోంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో అందమైన లొకేషన్లలో ఒక పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు.

అలాగే ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కాంతార’, ‘కరుప్పు’ చిత్రాలకు యాక్షన్ కంపోజ్ చేసిన ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ డిజైన్ చేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. హీరోగా నటిస్తూనే దర్శకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్ పోతినేని, ఈ షెడ్యూల్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు.

నియో-నోయర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ విభిన్నమైన సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ చిత్రానికి  సంగీతం: సామ్ సీఎస్; డీవోపీ: తిరునావుక్కరసు; స్టంట్స్: పీటర్ హెయిన్, విక్రమ్ మోర్; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్; నిర్మాత: కృష్ణ పోతినేని; రచన, దర్శకత్వం: రామ్ పోతినేని.