calender_icon.png 5 November, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజారును మంత్రిని చేయడం రాజ్యాంగ విరుద్ధం

05-11-2025 01:52:10 AM

-జూబ్లీహిల్స్‌లో 1.20 లక్షల ఓట్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించిన రాజకీయ చర్య

-మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్

-నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్

ఖైరతాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్  మొహమ్మ ద్ అజారుద్దీన్‌కు రాష్ట్ర మంత్రిగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ రాష్ర్ట రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యకుడు, మాజీ ఎమ్మె ల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. మంగళవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది భారత ఎన్నికల సంఘ విధానపరమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ల స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

ప్రస్తుతం కోడ్ అమలులో ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సుమారు లక్ష ఇరవైవేల మంది ఓట్లను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన రాజకీయ చర్యగా పేర్కొన్నారు. గవర్నర్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, తెలంగాణ ప్రధా న ఎన్నికల అధికారులు అజారుద్దీన్ నియామకాన్ని తక్షణమే నిలిపివేయాల్సిందిగా డి మాండ్ చేశారు.  ఉప ఎన్నికల కాలంలో ఆయన జుబ్లీహిల్స్ నియోజకవర్గం లో పర్యటించకుండా నిషేధం విధించాలని కోరారు. 

13 నుంచి సామాజిక చైతన్య రథయాత్ర

రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ చేపట్టిన ‘సామాజిక చైతన్య రథయాత్ర’ రెండవ దశ ఈ నెల 13న కరీంనగర్ నుంచి తిరిగి ప్రారంభమవుతుందని దిలీప్‌కుమార్ తెలిపారు. నిజామా బాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల నుంచి సాగుతూ, ఈ నెల 17న ఆదిలాబాద్ లో ముగుస్తుంది అని దిలీప్‌కుమార్ తెలిపా రు. ఈ యాత్ర ద్వారా తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతను బలోపేతం చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో ఈ వర్గాలు రాజ్యధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి దోహదపడటం తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ లక్ష్యమని ఆయన తెలిపారు.

రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి

ఈ సందర్భంగా రాష్ట్రీయ లోక్‌దళ్ జాతీ య మహిళా అధ్యకురాలు ఇందిరా మాట్లాడూతూ.. చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధి త కుటుంబాలకు రాష్ట్రీయ లోక్ దళ్ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. తెలంగాణలోని అన్ని రహదారులను డబుల్ లేన్లుగా విస్తరించాలని, అలాగే రోడ్డపై నడుస్తున్న ఫిట్‌నెస్ లేని వేలాది వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుం డా ఆధునిక పరిజ్ఞానాన్ని వాడాలని, ప్రతి బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి, రవాణా మంత్రి, రహదారులు, భవనాల మంత్రులదేనని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ లోక్ దళ్ నాయకులు ఎంఎస్ బైగ్ హైదరాబాద్ అధ్యకుడు, బీరప్ప యాదాద్రి భువనగిరి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు రిషభ్, విశాల్, మల్లేశ్, నరసింహరావు, సిద్ధం కుమార్ పాల్గొన్నారు.