calender_icon.png 5 November, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్నీ మీద పడిదంటూ.. కత్తులతో దాడి

05-11-2025 01:50:25 AM

-ఆపై హత్య.. 24 గంటల్లో చేదించిన నాచారం పోలీసులు 

-నిందితుల్లో ఒకరు మైనర్                               

ఉప్పల్, నవంబర్ 4 (విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసు  అత్యంత దారుణ సంఘటనగా మారింది. పొరపాటున చట్నీ మీదపడ్డాముతో గంజా యి మత్తులో  ఆ వ్యక్తిని కార్లు  కిడ్నాప్ చేసి మరి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య కేసులో ఒకరు మైనర్ కాగా మరో ముగ్గురు మేజర్లు అందులో ఒక వ్యక్తికి  గత ఎనిమిదేళ్ల క్రితం ఫోక్సో ఆక్ట్ కింద  జైలుకు వెళ్లి ఇటీవల కాలంలో బయటికి వచ్చాడు. వివరాల్లోకెళ్తే  సోమవారం నాడు తెల్లవారుతుండగానే  నాచారం పారిశ్రామిక వాడలో  ఓ వ్యక్తి రక్తపు మడుపులో కొన్ని ఊపిరితో  ఉన్న వ్యక్తులు చూసి స్థానికులు పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు. 

108 అంబులెన్స్ వచ్చేసరికి  ఆ వ్యక్తి మృతి చెందడంతో  పోలీసులు కేసు నమోదు చేసుకొని  చనిపోయిన వ్యక్తి మురళీకృష్ణ ఉప్పల్ కళ్యాణపురి వాసిగా గుర్తించారు. ఉత్తిరిత కూలి పని చేసుకుంటున్న మురళి కృష్ణ  ఈనెల రెండో తేదీన సరూర్నగర్ జిల్లాలగూడలో  తన అన్నను కలవడానికి తిరుగు ప్రయాణంలో  ఉప్పల్ ఎంజీఆర్‌ఐ సమీపంలోని  టిఫిన్ చేసేందుకు ఆగాడు. నాచారం కు చెందిన జూనైడ్ మణికంఠ సైఫుద్దీన్ మరియు ఒక మైనర్ బాలుడు  నలుగురు వ్యక్తులు డిజైర్  కారులో   వచ్చి టిఫిన్ చేస్తున్న మురళి కృష్ణ పక్కన  ఉన్నారు. టిఫిన్ చేసిన సందర్భంలో  మురళీకృష్ణ  ప్లేట్లో ఉన్న చెట్ని  ఈ నలుగురిలో ఉన్న ఒకరిపై  పడడంతో  వారు వాగ్వివాదం దిగారు.

దీంతో కోపద్రులైన ఆ నలుగురు  మురళీకృష్ణ పై దాడికి దిగారు. అనంతరం మురళీకృష్ణను  వారి కారులో కిడ్నాప్ చేస్తూ  నాచారం మల్లాపూర్ పరిసరపాల తిప్పుకుంటూ  నాచారం పారిశ్రామిక వాడ తెలం గాణ ఫుడ్స్ సమీపంలో కత్తులతో అతి క్యూరాక్వంగా దాడి చేసి  పారిపోయారు.  మురళీకృష్ణ కేకలు విన్న స్థానికులు  పోలీసులకు సమాచారం అందించడంతో  పోలీసు  సంఘటన స్థలం చేరుకునే  నిందితుల అక్కడి నుంచి పారిపోయారు.                              

24 గంటల్లో హత్య కేసు  చేదించిన నాచారం పోలీసులు....  

హత్య జరిగి 24 గంటలు గడవకముందే  నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ నేతృత్వంలో నిందితుని అతిలోకనిందితుని అదుపులోకి తీసుకుని రిమాండ్ తీసుకుని రిమాండ్ తరలించారు. క్లూస్  టీమ్ సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుల ను మౌలాలిలో  అదుపులో తీసుకున్న పోలీసులు  వారి నుండి హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలు ఉన్న  దుస్తులు  స్వాధీ నపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గంజాయి మత్తులో యువకులు చేసింది దారుణమైన  నేరమని  బాధితి కుటుంబాన్ని న్యాయం చేసే అందుకే  కేసును ఒక ఛాలెంజ్గా తీసుకొని నిందితులు తీసుకున్నామని తెలిపారు. మైనర్ బాలుని  కోర్ట్ జ్యువెలరీ హోం కు హాజరు పరచామని  మేజరైన ముగ్గుని రిమాండ్ తరలించినట్టు ఆయన పేర్కొన్నారు.                            

మైనర్ ఉన్నప్పుడే నేర చరిత్ర.. 

మురళీకృష్ణ హత్య కేసులో  నిందితుడిగా ఉన్న సైఫుద్దీన్ మైనర్ ఉన్నప్పుడే ఫోక్సో  కేసులో   గత 8 నెలల క్రితం జైలుకు వెళ్లాడు. గత కొంతకాలం క్రితమే  జైలు నుంచి వచ్చిన సైఫాదిన్ గంజాయి తీసుకొని  హత్యకు పాల్పడి  కుటుంబాన్ని రోడ్డుపాలు చేయడం  పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.