05-11-2025 01:52:19 AM
మాకు ఒక్క సంక్షేమ పథకం అందలేదు
గత కొంత కాలం గా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయనికి అడుగుపెట్టింది లేదు
వస్తున్నట్టుగా సమాచారం కూడా ఉండటం లేదు
పేరుకే బిఆర్‌ఎస్ పార్టీ పనులన్నీ వారికే
చర్ల, నవంబర్ 4 (విజయక్రాంతి):స్థానికచర్లలో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంగళవారం చర్ల మండల పర్యటన చేశారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు.. అయితే టిఆర్‌ఎస్ పార్టీ చర్ల మండల కార్యకర్తలు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని ముట్టడించారు, గత సార్వత్రిక ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడిన తెల్లం వెంకట్రావుని ఎంతో కష్టపడి గెలిపించామని కష్టానికి ఫలితం లేకుండా పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని
కష్టపడి ఎమ్మెల్యే గా గెలిపించిన బిఆర్‌ఎస్ కార్యకర్తలకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు అందడం లేదని కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని భద్రాచలం శాసనసభ సభ్యులు తెల్లం వెంకట్రావు ను చర్లలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు నిలదీశారు.
అప్పుడు ఇప్పుడు బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒరిగింది ఏమీలేదని, గత పది సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్న స్థానిక ఎం ఎల్ ఏ వేరే పార్టీ కావడంతో సంక్షేమ పధకాలు ఏవీ కూడా కార్యకర్తలకు అందలేదు అని, 2023 సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తలు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని పోటా పోటీగా రేయింబవళ్ళు కష్టపడి గెలిపించించామని,
కానీ ఇప్పటివరకు ఒక్క సంక్షేమ పథకం కూడా కార్యకర్తలకు అందడం లేదు అని మళ్ళీ ఇప్పుడు కూడా కష్టపడ్డ వారికి ఫలితం కాకుండా అప్పుడు అపోజిషన్ లో ఉన్న వారికే ఇపుడు మేలు జరుగుతుందని ,భద్రాచలం నియోజకవర్గం లో చర్ల మండలం అంటేనే రాష్ట్రస్థాయిలో రాజకీయాలకు ఎం తో పేరు గడించిందని కష్టపడ్డ కార్యకర్తలను మరిచిపోతున్నారని, ఇకనైనా మిమ్మల్ని గెలిపించిన కార్యకర్తలకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చేయాలి అని డిమాండ్ చేశారు,
ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ముందుకు అడుగులు వేశారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన నాయకు లు కాకి అనిల్ సోషల్ మీడియా ఇంచార్జ్ పంజా రాజు బిసి సెల్ అధ్యక్షులు గోరంట్ల వెంకటేశ్వరరావు, యూత్ అధ్యక్ష కార్యదర్శులు అంబోజీ సతీష్ కుప్పల నిరంజన్ యూత్ నాయకులు తడికల బుల్లెబాయి, సంతపురి సతీష్, గోగికర్ ప్రేమ్ కుమార్ చెన్నుమల్ల వంశి తదితరులు పాల్గొన్నారు,