16 July, 2026 | 9:46 AM

ఒడిదుడుకుల్లోనే మార్కెట్

22-04-2024 12:16 AM

n అంతర్జాతీయ సంకేతాలు, క్యూ4 ఫలితాలతో హెచ్చుతగ్గులు

n ఇరాన్ పరిణామాలపై ఇన్వెస్టర్ల దృష్టి

n స్టాక్ సూచీల కదలికలపై విశ్లేషకుల అంచనాలు

ముంబై, ఏప్రిల్  21: ఈ వారం సైతం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల బాటలోనే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  గత శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ కనిష్ఠస్థాయి నుంచి నాటకీయంగా కోలుకుని 73,088 పాయింట్ల వద్ద ముగిసినప్పటికీ, మధ్యప్రాచ్య రాజకీయ ఉద్రిక్తతల నడుమ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,156 పాయింట్లు, నిఫ్టీ 372 పాయింట్ల చొప్పున తగ్గాయి. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతల్ని జాప్యం చేస్తుందన్న సంకేతాలతో వారం మొత్తం ఐటీ షేర్లు భారీగా 4.71 శాతం నష్టపోయాయి.

గత 12 నెలల్లో ఇంతటి నష్టాన్ని సాఫ్ట్‌వేర్ షేర్లు చవిచూడటం ఇది రెండోసారి. ఐటీతో పాటు రియల్టీ, బ్యాంకింగ్ షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ వారం సైతం ఇరాన్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంకేతాలు, క్యూ4 ఫలితాల నడుమ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని విశ్లేషకులు పేర్కొం టున్నారు. ట్రేడర్లు వారి పొజిషన్లను హెడ్జ్ చేసుకోవాలని, వివిధ అంశాలపై స్పష్టతవచ్చేంతవర కూ వేచిచూడాలని సూచిస్తున్నారు. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలివే..

  విదేశీ ఇన్వెస్టర్ల యాక్టివిటీ

ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు ) యాక్టివిటీ సైతం నిర్దేశిస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు. గతవారం ఎఫ్‌పీఐలు హఠాత్తుగా మార్కెట్ నుంచి నిధులు వెనక్కు తీసుకున్నారు. యూఎస్ 

ద్రవ్యోల్బణం అంచనాల్ని మించి పెరగడంతో ఆ దేశపు బాండ్ ఈల్డ్స్ 

ర్యాలీ జరిపిన నేపథ్యంలో గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు భారత్‌లో రూ. 20,000 కోట్లకుపైగా నికర విక్రయాలు జరిపారు. పలు నెలలపాటు కొనుగోళ్లు జరిపిన డెట్ మార్కెట్లో సైతం విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు పాల్పడ్డారని, ఏప్రిల్ 20 వరకూ వీరు రూ.13,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ 

ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు.

నిఫ్టీకి 22,300 స్థాయి కీలకం

ఈ వారం సాంకేతికంగా నిఫ్టీ సూచి 22,300పైన స్థిరపడితేనే తదుపరి రికవరీ సాధ్యపడుతుందని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. గత శుక్రవారం నిఫ్టీ అప్‌వర్డ్ స్లోపింగ్ సపోర్ట్ ట్రెండ్‌లైన్‌ను పరిరక్షించుకుని, కీలకమైన 22,000 పాయింట్లపైన నిలిచి బుల్లిష్ రివర్సల్ సిగ్నెల్ ఇచ్చిందన్నారు. ఇది కరెక్టివ్ దశ తర్వాత బుల్లిష్ మూమెంటంను సూచిస్తున్నదన్నారు. నిఫ్టీకి తదుపరి అవరోధ స్థాయి అయిన 22,300 పాయింట్లు ఈ వారం కీలకమైనదని విశ్లేషించారు. ఈ స్థాయిపైన స్థిరపడితే 22,500 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఈ వారం తక్షణ మద్దతు 22,000 స్థాయి వద్ద లభిస్తున్నదన్నారు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని రెలిగేర్ బ్రోకింగ్ విశ్లేషకుడు అజిత్ మిశ్రా వ్యక్తం చేస్తూ ప్రస్తుతం 20డీఈఎంఏ రేఖ కదులుతున్న 22,300 పాయింట్లపైన నిఫ్టీ స్థిరపడితే మార్కెట్ మరింత కోలుకుంటుందన్నారు. దిగువస్థాయిలో 21,700 శ్రేణి మద్దతుగా నిలుస్తుందని అంచనా వేశారు.

చమురు ధరలు

ఈ ఏడాది ఇప్పటివరకూ చమురు ధరలు 16 శాతం పెరిగి దాదాపు 90 డాలర్ల స్థాయికి సమీపంలో కదులుతున్నాయి. ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇంధన మౌలిక వసతులపై ఉక్రెయిన్ పరస్పర దాడులతో చమురు ధరలు గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఈ చమురు ధరల హెచ్చుతగ్గులపై మార్కెట్ దృష్టి పెడుతుందని, ఇవి మరింతగా పెరిగితే భారత సూచీలు వెనకడుగు వేస్తాయని వినోద్ నాయర్ వివరించారు.

22nd April to 27th April

ఈ వారం క్యూ4 ఫలితాలు

వెల్లడించే ప్రధాన కంపెనీలివే

మార్చితో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి  ఈ వారంలో పలు బ్లూచిప్ కంపెనీలు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. దేశీయ టాప్ కార్పొరేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఆటో దిగ్గజం మారుతి, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్ తదితరాల ఆర్థిక ఫలితాలు వెల్లడవుతాయి. 

ఫలితాల్ని ప్రకటించే కంపెనీలు



ఏప్రిల్ 22

రిలయన్స్ ఇండస్ట్రీస్, కేశోరామ్ 

ఇండస్ట్రీస్, హట్సన్ ఆగ్రో, 

తేజాస్ నెట్‌వర్క్స్

ఏప్రిల్ 2౩

టాటా కన్జూమర్‌ప్రొడక్ట్స్, ఐసీఐసీఐ

ప్రుడెన్షియల్ లైఫ్, టాటా ఎలక్సీ, 

ఎం అండ్ ఎం ఫైనాన్స్

ఏప్రిల్ 2౪

హిందుస్థాన్ యూనీలీవర్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, మాక్రోటెక్  డెవలపర్స్, ఇండియన్ హోటల్స్

ఏప్రిల్ 2౫

బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, 

టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్  టీ టెక్నాలజీ, ఏసీసీ, 

కోరమాండల్ ఇంటర్నేషనల్, సైయెంట్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, తాన్లా ప్లాట్‌ఫాం, గాయత్రి షుగర్స్

ఏప్రిల్ 2౬

మారుతి సుజుకి, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్ 

ఇన్సూరెన్స్,  శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ కార్డ్స్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్, ఎన్డీటీవీ

ఏప్రిల్ 2౭

ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్,  ఆర్బీఎల్ బ్యాంక్, 

సంఘి ఇండస్ట్రీస్

క్యూ4 ఫలితాలు

క్యూ4 ఫలితాల సీజన్ సందర్భంగా ఈ వారం 

రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకి 

తదితర ప్రధాన కంపెనీలు త్రైమాసిక అంకెల్ని 

వెల్లడించనున్నాయి. వీటికి తోడు కీలకమైన 

పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 

గణాంకాలు కూడా విడుదలవుతాయి.

ఇరాన్ ఉద్రిక్తతలు

ఇటీవల మొదలైన ఇరాన్ పరస్పర దాడులు తీవ్రతరమైతే మార్కెట్లో భయాలు పెరుగుతాయని, దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడతారని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఒడిదుడుకులు పెరుగుతాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్  సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. గరిష్ఠ చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం రిస్క్‌లు ఉంటాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. హెచ్చరించారు. యూఎస్ రేట్ల కోత జాప్యం కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరుస్తుందన్నారు.