2 April, 2026 | 3:21 AM

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ కొత్త షోరూమ్

02-04-2026 12:03 AM

సంగారెడ్డి | 2026: మలబార్ గోల్డ్ & డైమండ్స్ తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృత శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా ఉండడంపైనే బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి , టీఎస్ఐఐసీ లిమిటెడ్ చైర్‌పర్సన్ టి. నిర్మల జగ్గారెడ్డి ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ , డైమండ్స్ సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులు సిరాజ్ పీకే, హెడ్ -  రిటైల్ ఆపరేషన్స్ (రెస్ట్ ఆఫ్ ఇండియా), షానిబ్ కే, జోనల్ హెడ్ - తెలంగాణ, ముహమ్మద్ షరీజ్ కే, జోనల్ హెడ్ -  హైదరాబాద్, మరియు అసిస్టెంట్ షోరూమ్ హెడ్ ఇంజిఫ్ అబ్దిల్లా పాల్గొన్నారు.

మలబార్ గోల్డ్ , డైమండ్స్ యొక్క ప్రపంచ స్థాయి వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా సంగారెడ్డి షోరూమ్ రూపొందించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ షోరూమ్‌లో సాంప్రదాయ, సమకాలీన అభిరుచులకు అనుగుణంగా బంగారం, వజ్రాలు, ప్లాటినం, విలువైన రత్నాల ఆభరణాల విస్తృత శ్రేణి అందుబాటులో ఉన్నట్టు వెల్లడించాయి. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం. పి. అహ్మద్ మాట్లాడుతూ, “మలబార్ గోల్డ్ ,డైమండ్స్‌కు తెలంగాణ ఒక కీలకమైన మార్కెట్‌గా ఉందన్నారు. సంగారెడ్డి షోరూమ్, వినియోగదారులకు క్రమబద్ధమైన, ఆహ్వానించదగిన, ప్రపంచ స్థాయి రిటైల్ అనుభవాన్ని అందిస్తూ, ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తమకు వీలు కల్పిస్తుందన్నారు.