11-09-2024 12:41:40 PM
ముంబై: బాలీవుడ్ భామ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ముంబైలోని తన బాంద్రా నివాసం ఆరో అంతస్తు టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాంద్రా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. పోలీసు అధికారులు ఘటన వెనుక ఉన్న పరిస్థితులను వెలికితీసేందుకు దర్యాప్తు ప్రారంభించారు. మలైకా తండ్రి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. 2022 లో, మలైకా ఒక ఇంటర్వ్యూలో తన 'అద్భుతమైన' బాల్యం గురించి మాత్రమే కాకుండా, తన జీవితంలోని ప్రారంభ సంవత్సరాల్లో కష్టాలను ఎలా ఎదుర్కొన్నానో కూడా మాట్లాడింది. తన తల్లిదండ్రులు అనిల్ అరోరా, జాయిస్ పాలీకార్ప్ విడాకులు తీసుకున్నప్పుడు తనకు 11 ఏళ్లు మాత్రమేనని ఆమె గుర్తుచేసుకుంది.