calender_icon.png 12 November, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు బాతు బందీ.. గుర్తించలేని కాందహార్ హైజాకర్లు !

11-09-2024 01:04:51 PM

న్యూఢిల్లీ: కాందహార్ లో హైజాక్ కు గురైన విమానంలోనే ప్రపంచ కరెన్సీ కింగ్ ఉన్నాడు. కాకపోతే ఉగ్రవాదులకు అతడు ఎవరో తెలియకపోవడంతో.. ఇండియాకు  పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకన్నట్లైంది. ప్రపంచంలో వినియోగించే 90 శాతం కరెన్సీ ముద్రణకు మెటీరియల్ సరఫరా చేసే ఓ వ్యాపార వేత్త ఆ విమానంలోనే ఉన్నాడు. హైజాకర్ల నజర్ ఆయన పైకి మళ్లలేదు. దీంతో ఆ కుబేరుడు ప్రాణాలతో బయట పడ్డాడు. నేపాల్ రాజధాని కాట్మండూ నుంచి 1999 డిసెంబర్ 24న బయల్దేరిన విమానం కొద్దిసేపటికే హైజాక్ అయ్యింది. ఈ విమానంలో కరెన్సీ ముద్రణ తాలూకు ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో  పెద్ద తలకాయగా పరిగణించే స్విస్.. ఇటాలియన్ వ్యాపార దిగ్గజం 'రాబర్టో గియోరీ' కూడా ప్రయాణిస్తున్నారు.

ఈ విషయం బయటికి పొక్కితే 70 దేశాలు అతలాకుతలం అయ్యేవి. ఎందుకంటే ఈ స్విస్.. ఇటాలియన్ వ్యాపార వేత్త యూకేలో నిర్వహించే "డె లా ర్యూ "(De La Rue)  అనే కంపెనీ ప్రపంచంలో వినియోగంలో ఉన్న 90 శాతం కరెన్సీ నోట్ల ముద్రణకు మెటీరియల్ సరఫరా చేస్తుంది. 70కి పైగా దేశాలు తమ నోట్లను ఈయన కంపెనీ తాలూకు మెటీరియల్ వాడి ప్రింటింగ్ చేసేవారు. ఆయన స్విట్జర్లాండ్ లో అత్యంత ధనికులలో ఒకరు.  'రాబర్టో గియోరీ' తన భార్య క్రిస్టినా కలాబ్రసీ తో కలిసి కాట్మాండూలోని హాలీడే వీకెండ్ ను ముగించుకుని తిరిగివస్తూండగా ఆయన ప్రయాణిస్తున్న ఐసీ 814ను పాక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 200 మిలియన్ డాలర్ల నగదును సైతం డిమాండ్ చేశారు.. హైజాకర్లకు తాము బంధించిన స్విస్.. ఇటాలియన్ మిలియనీర్ ను బందీగా పట్టుకుంటే బంగారుబాతును గుప్పిట పట్టినట్లేగా?  కానీ విచిత్రమేంటంటే.. విధి బలీయమైంది అన్నట్లు.. ఆ విషయం తెలియక పోవడం మనఅదృష్టం హైజాకర్ల దురదృష్టం. భారత్ పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడికి కారణం కూడా  రాబర్టో అయ్యాడు. ఈ విషయాన్ని 2000 సంవత్సరంలో టైమ్స్ పత్రిక ప్రచురించింది.

కాగా ప్రపంచవ్యాప్త సెంట్రల్ బ్యాంకులు  కరెన్సీ నోట్ల ముద్రణకు వినియోగించే రహస్య థ్రెడ్, సెక్యూరిటీ హోలోగ్రమ్ లు తదితర భద్రతా ప్రమాణాలకోసం నిర్వహించే ప్యారామీటర్ల కు కావాల్సిన సాధన సామగ్రిని  "డె లా ర్యూ "(De La Rue)   కంపెనీ సరఫరా చేస్తుంది.  ఈ సంస్థ 2016 వరకు భారత్ కు వీటిని సరఫరా చేసేది. ఆ ఏడాది   "డె లా ర్యూ "(De La Rue)కంపెనీ పేరు పనామా పేపర్స్లో సైతం వచ్చింది. భారత్ లోని బ్యంక్ నోట్ల కంట్రాక్ట్ పొందేందుకు ఇక్కడ ఒక నేత కు కమీషన్ చెల్లించినట్లు కూడా టైమ్స్ కథనం తెలిపింది.

2010లో ఈ సంస్థ భారత్ కు సరఫరా చేసిన వాటర్ మార్క్ పేపర్ లో లోపాలు ఇంటర్నల్ ఇన్వస్టిగేషన్లో బయటపడింది. తదనంతరం రిజర్వ్బ్యంక్ ఆఫ్ ఇండియా ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.  హోంశాఖ అభ్యంతరాలున్నా సరే 2012లో నాటి ఫైనాన్స్ సెక్రటరీ అరవింద్ మాయారామ్ ఈ సంస్థ నుంచే కరెన్సీ తాలూకు సెక్యూరిటీ థ్రెడ్ కొనుగోలుకు ఆమోద ముద్ర వేశారు. ఎలాంటి టెండర్ ప్రక్రియను నిర్వహించలేదు. ఈ విషయంపై 2017లో సీబీఐ చేపట్టిన దర్యాప్తు సైతం సదరు చర్య నేరపూరిత ఉద్దేశ్యంతో కూడిందని తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.