calender_icon.png 4 February, 2026 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్ పరిశీలన

04-02-2026 08:48:22 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మండల పరిధిలోని అశ్వాపురం, గొందిగూడెం, తుమ్మలచెరువు గ్రామపంచాయతీలలో హౌసింగ్ శాఖ పీడీ రవీంద్రనాథ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణం నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

నిర్మాణంలో నాణ్యత లోపం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇండ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయవంతంగా అమలు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.