calender_icon.png 4 February, 2026 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా స్థాయికి మూడు కుభీర్ జట్ల ఎంపిక

04-02-2026 08:45:22 PM

సీఎం కప్ నియోజకవర్గ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక 

విద్యార్థులను అభినందించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు 

కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండలంలోని 42 జీపీ లలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు 'సీఎం కప్' క్రిడల్లో మండల స్థాయిలో ఆడి బుధువారం ముధోల్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చి వాలీబాల్ (బాలుర ), వాలీబాల్ (బాలికలు ) జట్ల తో పాటు కబడ్డీ బాలుర జట్టు  గెలుపొంది జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. దీంతో తహసీల్దార్ శివరాజ్, ఎంపిడివో గంగాసాగర్ రెడ్డి, ఎంఈవో విజయ్ కుమార్, సర్పంచ్ కందూరి సాయినాథ్ లు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతో పాటు పీడీ క్రాంతిని అభినందించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లోను రాణించి రాష్ట్ర స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.