04-02-2026 08:51:45 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అలాగే అంగన్వాడి సెంటర్ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు. గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరు నాణ్యతతో నిర్మించుకోవాలని తెలిపారు.
కేంద్రంలో విద్యార్థులకు మెనూ ప్రకారం బలమైన భోజనాన్ని అందించాలని తెలిపారు. గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులకు ప్రతి ఒక్కరూ హాజరై ఉపాధి పొందాలని సూచించారు. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపాధి పనులకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వనజ ఉన్నారు.