02-12-2025 08:06:38 PM
కోదాడ: కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాసాని వెంకటేశ్వర్లు సర్పంచ్ అభ్యర్థిగా మంగళవారం తన నామినేషన్‌ను అధికారికంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు ప్రకటించారు. నామినేషన్ అనంతరం కాసాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో విజయాన్ని సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలస్థాయి నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.