15 April, 2026 | 12:08 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

సర్పంచ్ గా మాలోతు సక్రు నాయక్ ప్రమాణస్వీకారం

22-12-2025 05:46 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మాలోతు సక్రు నాయక్ సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు కార్యకర్తలు యువత అందరూ ఊరేగింపు గా బయలుదేరి గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ క్రాంతి, కార్యదర్శి సమక్షంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తండా ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా సేవా చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం గ్రామ పెద్దలను సన్మానించారు.ఈ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా మఠంపల్లి మాజీ జెడ్పిటిసి సైదులు తదితరులు పాల్గొన్నారు.