22-12-2025 05:43:00 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శేట్లూర్ గ్రామ నూతన సర్పంచ్ గా కాళోజి విఠల్ రావ్ సోమవారం ప్రమాణం స్వీకారం చేశారు. గ్రామ ప్రజలు, నాయకులు, అధికారుల సమక్షంలో జరిగిన కార్యక్రమం ఘనంగా జరిగింది. అయన మాట్లాడూతూ...గ్రామ అభివృద్ధి తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సర్పంచ్ తెలిపారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.ప్రజల సమస్యలకు వెంటనే స్పందించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ఈ వేడుకలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.