calender_icon.png 22 December, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుదీరిన సోనాల మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం

22-12-2025 05:49:33 PM

బోథ్,(విజయక్రాంతి): సొనాల మండల మేజర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి యాళ్ల బిందుజా-సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ తుల శ్రీకాంత్, 10 మంది వార్డు మెంబర్లుచే ప్రమాణ స్వీకారమహోత్సవంలో ఎంపీడీవో మహేందర్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని సన్మానించి అభినందించారు.

 ఈ సందర్భంగా సర్పంచ్ యాల్ల బిందుజ -సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించినందుకు సోనాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సోనాల గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ మాట్లాడుతూ సోనాల నూతన కార్యవర్గం ఐక్యమత్యంగా పనిచేయాలన్నారు. సోనాల ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో దశలవారీగా  నెరవేరుస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ గా గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు నాయకులు ఉన్నారు.