9 June, 2026 | 1:27 AM

తిరుపతిరెడ్డి.. మా పార్టీ కార్యకర్త కాదు

09-06-2026 12:00 AM
  1. మంత్రిని విమర్శిస్తే నాలుక కోస్తాం
  2. కాంగ్రెస్ నాయకులు

భీమదేవరపల్లి, జూన్ 8 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండ లం రంగేపల్లి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కనీసం కార్యకర్త కూడా కాదని ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను విమర్శిస్తే నాలుక కోస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ మేర కు బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పూరి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, ముల్కనూర్ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, కొలుగూరి రాజు, చిదురాల స్వరూప, పిడిశెట్టి కన కయ్య, ఊస కోయిల ప్రకాష్ ,ఆదరి రవీందర్‌లు మీడియా సమావేశం ఏర్పాటు చేశా రు.

శనివారం భీమదేవరపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి రంగయ్యపల్లి గ్రామానికి విరాళంగా ఇచ్చిన భూ మి పట్టా కాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నాడని మంత్రి పొన్నం విమర్శిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే స హించేది లేదన్నారు. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిదురాల స్వరూప ఆదివారం రంగ య్యపల్లి గ్రామానికి వెళ్లి న్యాయపరంగా మాట్లాడేందుకు ప్రయత్నించగా తిరుపతిరెడ్డి గ్రామస్తులతో ఆమెపై దాడికి ప్రయత్నించినారని ఆరోపించారు.

ఈ విషయంపై ఇరువ ర్గాలు ఒకరిపై ఒకరు వంగర ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారని ఆ రోపించారు. బేషరత్‌గా ఆయన క్షమాపణలు చెప్పకపోతే ఆయనకు తగిన బుద్ధి చె ప్తామని హెచ్చరించారు.సమావేశంలో మా ర్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు బొక్కల స్రవం తి, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, ఉపసర్పంచ్ కాశగోని మమత బాలకృష్ణ, జక్కుల అనిల్, చిట్కూరి అనిల్, శ్రీనివాస్, చెవ్వల బుచ్చయ్య, పచ్చునూరి కర్ణాకర్, మా డుగుల గోపి, తాళ్లపల్లి సదానందం, గుడికందుల రాజు తదితరులు పాల్గొన్నారు.