calender_icon.png 15 November, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

15-11-2025 12:31:02 AM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మున్సిపాలిటీలోని ఉత్కూర్ కు చెందిన చరణ్ మోతిలాల్ అనే (36) వ్యక్తి నిన్న సాయంత్రం 6 గంటలకు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని ఎస్ఐ సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రాజస్థాన్కు చెందిన వాడని గత15 సంవత్సరాల క్రితం లక్షెట్టిపేటకు వచ్చి ఇక్కడ వినాయకులను తయారు చేసి తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నాడు.

మృతునికి తన భార్యకి అప్పుడప్పుడు కుటుంబంలో గొడవలు జరిగేవి. అదే క్రమంలో వినాయక చవితి పండుగ అయిన తర్వాత మృతుడు అతని భార్యతో గొడవ పడగా భార్య తన ముగ్గురు పిల్లల్ని మృతిని వద్ద వదిలేసి రాజస్థాన్ లోని తల్లిగారింటికి వెళ్లిపోయింది. అప్పటినుండి మృతుడు దిగులు పడుతూ ఉండేవాడని భార్యకి ఫోన్ చేసి రావాలని చెప్పిన తను రాకపోవడంతో గతంలో రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారన్నారు. తాను ఎంత చెప్పినా రాకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని మృతుని తమ్ముడు చరణ్ బికారాం ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.