calender_icon.png 15 November, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానుభావుల కలలను, ఆశయాలను నెరవేర్చాలి

15-11-2025 12:32:03 AM

బాలల దినోత్సవంలో  ఎస్పీ కె. నరసింహ

గరిడేపల్లి, నవంబర్ 14 : ఉన్నత లక్ష్యం, నిరంతర సాధనతో మంచి విజయాలు సాధ్యం అని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం జరిగిన బాలల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ ఈనాటి పురోగతి చెందిన భారత దేశం కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారన్నారు.

నెహ్రూ బాలల విద్య, వికాసం, హక్కుల కోసం ఎంతగానో కృషి చేసి చాచా నెహ్రుగా ప్రసిద్ధి చెందారన్నారు. మహానుభావుల కలలను, ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత నేటి భావి భారత పౌరులపై ఉన్నదన్నారు.  ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, గరిడేపల్లి ఎస్త్స్ర నరేష్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తా

 మిర్యాలగూడ. నవంబర్ 14, విజయక్రాంతి: మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా మంజూరైన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పనులు త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ( బి ఎల్ ఆర్) అన్నారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని దామరచర్ల మండల కేంద్రంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి విద్యార్థినిలతో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకొని  మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నైతిక విలువలు, ఉత్తమ క్రమశిక్షణ, పెద్దలను గౌరవించే తత్వాన్ని పెంపొందించుకొని విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఉపాధ్యాయులు పునాదులు వేయాలన్నారు.  ఆయన వెంట ఎంపీడీవో అలివేలు మంగమ్మ, ఎంఈఓ ఎం బాలాజీ నాయక్,  ప్రత్యేక అధికారి కవిత తదితరులున్నారు.

నూతనకల్ ..

నూతనకల్ నవంబర్ 14:భారతదేశ తొలి ప్రధాని, దివంగత పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14న మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మరియు అంగన్వాడీ కేంద్రాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి, తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు కలెక్టర్లు, డీఈఓలు, ఎంఈఓలు, సైనికులు వంటి వివిధ వృత్తుల వేషధారణలతో అలరించి, అందరినీ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

కోదాడ నవంబర్ 14: కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ  జయంతి వేడుకలను శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.  నెహ్రూ చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెహ్రూ సేవలను కొనియాడారు.   

టీపీసీసీ డెలికేట్ చింతకుంట్ల లక్ష్మారెడ్డి , టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బాల్ రెడ్డి , అల్తా ఫ్ హుస్సేన్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మ న్ కందుల కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, సుందరి వెంకటేశ్వర్లు ,కట్టబోయిన శ్రీనివాస్ , గంధం యాదగిరి, ముస్తఫా,వీరా రెడ్డి ,  బ్రహ్మం, మేకపోతుల సత్యనారాయణ,లైటింగ్ ప్రసాద్, సంజయ్, జానీ, దాదావలి,దావెల్ వాచపల్లి వెంకటేశ్వర్ రెడ్డి రాంబాబు కొండల్ రెడ్డి,శోబన్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

 చిట్యాల..

 చిట్యాల, నవంబర్ 14 (విజయ క్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్ గ్రోవ్  పాఠశాలలో చిన్నారులు వివిధ వేషాధారణలో అలరించారు. అనంతరం ఉపన్యాస పోటీలను నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్, ఉపాధ్యాయులు, రాము,  రమేష్, లింగయ్య, ఫరీద్,  శేఖర్, సురేష్, విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.