06-10-2025 08:27:29 PM
కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డ మృతుడు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: కుటుంబ కలహాలతో వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మండల పరిధిలోని సీతారాంపురం గ్రామ సమీపంలోని గుట్టలో చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా కోటపేట గ్రామానికి చెందిన పూసల బద్రి(45) సంచార జాతులకు చెందడంతో తిరుమలగిరిలోని దిష్టి బొమ్మలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. భార్యతో గొడవపడి మనస్థాపం చెంది సీతారాంపురం గుట్ట వద్దకు చేరుకొని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.