06-10-2025 08:40:26 PM
ఉప్పల్ (విజయక్రాంతి): బైకు అదుపుతప్పి ఫుట్ పాత్ ను ఢీకొని వ్యక్తి దుర్మరణం జరిగిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండల్ చెంగిచెర్లకు చెందిన దిలీప్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి నాచారంలోని ఈనెల ఐదో తారీఖు నాడు తన స్నేహితుడి బర్తడే పార్టీకి వచ్చి తిరిగి వెళ్తుండగా నాచారం ఐఐసిటీ గేటు సమీపంలో బైక్ అదుపుతప్పడంతో పక్కనే ఉన్న ఫుట్ పాత్ ను ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమైంది. 108 సాయంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.