calender_icon.png 6 October, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభ్యం

06-10-2025 08:55:17 PM

మందమర్రి (విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అబ్రహంనగర్‌ కు చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు ఈ నెల 2న అదృశ్యం కాగా మండలంలోని సారంగపల్లి అటవీ ప్రాంతంలో మృతిచెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్రహంనగర్ కు చెందిన వేల్పుల ఎల్లయ్య(70) ఈ నెల 2వ తేదీన మేకలను కాసేందుకు ఇంటి నుండి వెళ్ళి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు తెలిసిన ప్రదేశాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.

ఈ మేరకు వృద్ధుని కుమారుడు వేల్పుల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సారంగపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు, గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సమాచారం అందుకున్న పట్టణ సిఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్సై రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం తప్పిపోయిన వేల్పుల ఎల్లయ్య దిగా గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పట్టణ ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.