06-10-2025 08:08:25 PM
మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డులో నిర్మించబడిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ పూజా కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శైలజ, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, 18వ వార్డ్ మాజీ కార్పొరేటర్ పులకండ్ల హేమలత జంగారెడ్డి, స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఇళ్లను అందించిందని తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలకు లబ్ధి కలిగిందని చెప్పారు. లబ్ధిదారులు మాట్లాడుతూ రూ.5 లక్షలతో తమకు సొంతిల్లు కలగజేసినందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోలు రాములు, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, సీసా వెంకటేష్ గౌడ్ ,సింగిరెడ్డి పద్మా రెడ్డి, హరినాథ్ రెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, విజయపురి కాలనీ అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.