calender_icon.png 6 October, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి

06-10-2025 09:40:16 PM

- బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ఉప్పరిగూడ మాజీ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి

- పొంగులేటిని కలిసి వినతిపత్రం అందజేసిన బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి

ఇబ్రహీంపట్నం: భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలని బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ఉప్పరిగూడ మాజీ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలోని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, తన ఛాంబర్ లో బూడిద రామ్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి రిజిస్ట్రేషన్, లే అవుట్లు, ప్లాట్లు రిజిస్ట్రేషన్, రెవిన్యూ శాఖల సమన్వయ లోపాలు భూ యజమానులు, ప్లాట్లు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం కోసం లే అవుట్ లకు ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. దీన్నిపై పొంగులేటి సానుకూలంగా స్పందించారాని బూడిద రాంరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నర్సింహా రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు మంగ ఐల్లేష్, రాంరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.