06-10-2025 09:38:32 PM
బెల్లంపల్లి అర్బన్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి రాజ్యాంగంపై చేసినట్లేనని పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక అధ్యక్షులు గోడిసెల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి రంగ ప్రశాంత్ మండిపడ్డారు. సోమవారం బెల్లంపల్లిలో న్యాయమూర్తి దాడిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుద్దిస్ట్ దళిత కమ్యూనిటీ నుంచి వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గావాయ్ పై లాయర్ రాకేష్ కిషోర్ దాడిని రాజ్యాంగంపై మనువాద దాడిగా అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధకంగా మాట్లాడటం, తీర్పులు ఇవ్వడాన్ని సహించలేక సహనం కోల్పోయినా మనువాది లాయర్ దాడికి దిగారన్నారు.
అంతేకాకుండా సనాతన ధర్మాన్ని కించపరుస్తే ఊరుకునేది లేదని న్యాయమూర్తినే హెచ్చరించడం, క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి కఠిoగా శిక్షంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షలు అక్కు ఉమ, ప్రచార కార్యదర్శి గొడిసెల చంద్రమౌళి, అక్కు కృష్ణ, కార్యదర్శి అక్కుకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గొడిసెల స్వామి, సంయుక్త కార్యదర్శి ఉండ్రాల రవి, ముఖ్య సలహాదారులు వేల్పుల కనకయ్య, జెంజర్ల రవిరాజ్, ఎంజల కుమార్, జంగం డాక్టర్ పాల్గొన్నారు.