24 August, 2026 | 9:58 AM

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

22-05-2024 12:17 AM

చొప్పదండి, మే 21: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నంకు చెందిన బైరగోని ఆనంద్ గౌడ్ (47) కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంచేస్తున్నాడు. వ్యాపారంలో అనుకున్నంతగా లాభాలు లేకపోగా, కొన్నిరోజులుగా నష్టాల్లో నడుస్తోంది. దీంతో అప్పులు అధికం కావడంతో నిత్యం బాధపడుతుండేవాడు. సోమవారం రాత్రి భార్యాపిల్ల లు నిద్రపోగానే, తన ఇంటిమెట్లవద్ద బాల్కానీలో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి తరువాత ఆనంద్ కనిపించకపోవడంతో భార్య రమ బయటకు వచ్చి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే రమ కేకలు వేస్తూ కూతురు, కొడుకులను పిలిచి ఆనంద్‌ను కిందికి దించారు. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసు లు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.