18-11-2025 11:34:03 AM
మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం భద్రతా సిబ్బందికి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. మారేడుమిల్లి టైగర్ జోన్‌లో ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అమిత్ బర్దార్ తెలిపారు. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Top Maoist Hidma) మృతి చెందాడు.
సుక్మాజిల్లాలోని పూర్వాటి గ్రాంలో హిడ్మా జన్మించాడు. బస్తర్, దంతేవాడ ప్రాంత దళంలో కీలక సభ్యుడిగా ఎదిగిన హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా హిడ్మా అలియాస్ సంతోష్ పేరొందాడు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గా హిడ్మా పనిచేశాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. దశాబ్దకాలంగా జరిగిన మావోయిస్టు కీలకదాడులకు హిడ్మా సూత్రధారి. దంతేవాడ, సుక్మా పరిధిలో 30 కి పైగా భారీ దాడులకు హిడ్మా నేతృత్వం వహించారు. హిడ్మాపై పలు రాష్ట్రాలు రూ. 6 కోట్ల వరకు రివార్డు ప్రకటించాయి. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుసుకున్నారు.