calender_icon.png 28 July, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

28-07-2025 11:14:55 AM

అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) గట్టు మండలం బల్గేర  గ్రామంలో సోమవారం ఉదయం 7:30 ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముక్కరయ్య  వెనక నుండి  అయిజ లయోలా స్కూల్ బస్సు ఢీ కొట్టింది.ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తిని స్థానికులు అయిజ ప్రభుత్వ హాస్పిటల్ కుతరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని  శోకసంద్రంలో మునిగిపోయారు.