calender_icon.png 28 July, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్ల మండలంలో మావోయిస్టు కరపత్రాలు, బ్యానర్లతో కలకలం

28-07-2025 11:12:44 AM

మావోయిస్టు వారోత్సవాలతో జిల్లా అలర్ట్

చర్ల,(విజయక్రాంతి): మావోయిస్టు వారోత్సవాలు(Maoists Week Celebrations) జరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్ కొత్తగూడెం పంచాయతీ పరిధిలో గల దానవైపేట రహదారిపై మావోయిస్టు బ్యానర్లు(Maoist leaflets) కరపత్రాలు వెలిశాయి. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలకు పిలుపు నిచ్చిన విషయం  తెలిసిందే. మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపద్యంలో సోమవారం మావోలు లేఖ విడుదల చేశారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం(BJP Government) మావోయిస్టు పార్టీపై రకరకాల ప్యూహాత్మక దాడులు చేస్తుందని, 2024 జనవరి నుండి కాగర్ ఆపరేషన్ పేరుతో 2025లో ఆపరేషన్ కర్రి గుట్టలు పేరుతో  మోదీ నాయకత్వం కుట్రపూరీత దాడులని బిజెపి  ప్రజలపై  కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాతుక కాగర్ ఆపరేషన్ను ప్రజా ఉద్యమాల ద్వారా, ఓడిద్దాం, అంటూ అమరుల ఆశయాలను వెలుగులో ప్రజాయుధాన్ని తీవ్రతరం చేద్దాం  అని లేఖ ద్వారా తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు యంత్రాంగం(Bhadradri Kothagudem District Police Administration) అలర్ట్ గా ఉంటూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు బ్యానర్లుకరపత్రాలు వెలవడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కలకలం రేగింది.