కరెంటు పోల్ మీద పడి వ్యక్తి మృతి
ఉప్పల్, సెప్టెంబర్ 2(విజయక్రాంతి) : కరెంటు పోల్ మీద పడి వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వైజయంతి థియేటర్ వద్ద వినాయకుని తీసుకెళుతున్న టస్కర్ వాహ నం పక్కనే ఉన్న కరెంటు పోల్ వైర్లను తాకు తూ వెళ్ళగా పోలు విరిగి అదే దారి నా వెళుతున్న కార్తికేయ నగర్ చెందిన బాగుందాం స్వాత్విక్ ( 23) పై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న నాచారం ఇన్స్పెక్టర్ రుత్విక్ కుమార్ సంఘటన చేరుకొని మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. కరెంటు వైర్లను చూసుకోకుండా వాహనం నడిపించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కరెంటు పోల్లు వైర్ల వాళ్ళ చనిపోతున్న పట్టించుకోని విద్యుత్ అధికారులు. ఇటీవల రామంతపూర్ బండ్లగూడ ఘటన మరవకముందే వరుస ఘటనలు అవుతున్న అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహ రిస్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






