వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం
03-09-2025 12:00 AM
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
- 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు : ఎస్పీ నరసింహ
- సూర్యాపేట, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : జిల్లాలో ఈనెల 5,6 తారీఖులలో జరిగే గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం పట్టణంలో గణేష్ నిమజ్జనం చేయు సద్దుల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పరిధిలో నిమజ్జనం సంబం ధించి ఆర్డిఓ, డిఎస్పి, మున్సిపల్ కమిషనర్ అన్ని శాఖల వారితో సమన్వయం చేసుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
- జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో గల కోదాడ, హుజూర్నగర్ తిరుమలగిరి లో ఎక్కువ విగ్రహాలు వస్తే ప్రణాళికలు సిద్ధం చేసుకుని రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ , సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు రాకుండా విగ్రహాలు ఒకదాని వెనుక ఒకటి వరుస క్రమంలో వచ్చి నిమజ్జనం చేసేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు, అనంతరం ఎస్పీ నరసింహ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3200 విగ్రహాలు ఉన్నాయని, వీటిని నిమజ్జనం చేయుటకు 1500 మంది పోలీసులను బందోబస్తు వినియోగిస్తున్నామన్నారు.
- ప్రజలకు, మహి ళలకు, వృద్ధులకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన ఏర్పాటు చేస్తున్నా మన్నారు. అలాగే విగ్రహాలను త్రాగునీటికి ఉపయోగించే పాలేరు రిజర్వాయర్లో, సాగర్ కెనాల్ లో నిమజ్జనం చేయరాదని, ఎక్కడైతే నిమజ్జనానికి ఏర్పాటు చేసామో అక్కడ మాత్రమే నిమజ్జనం చేయాలన్నారు. వీరి వెంట ఆర్డీవో వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, డిఎస్పి ప్రసన్నకుమార్, మత్స్య ఇరిగేషన్, ఫైర్ శాఖల అధికారులు, సూర్యాపేట ఎమ్మార్వో తదితరులు ఉన్నారు.






