5 August, 2026 | 1:07 AM

కేసీఆర్ ను బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి కుట్ర...

02-09-2025 11:29 PM

బోథ్,(విజయక్రాంతి): కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ కేసీఆర్ ను కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని బోథ్ బీఆర్ఎస్  శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాళేశ్వరం పై సి.బి.ఐ  విచారణకు వ్యతిరేకంగా మంగళవారం బోథ్, సోనాల మండలాల బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు.

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేశారు. ధర్నా చేసి దిష్టిబొమ్మను దాహనం చేసిన నాయకులను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ మాట్లాడుతూ కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు వరప్రదాయని అని దానివలన కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని దురుద్దేశంతో సిబిఐ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.