calender_icon.png 6 October, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ పండగతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సందడి..

06-10-2025 10:03:20 PM

మహిళా పోలీసులతో కలిసి ఉత్సాహంగా ఆడి పాడిన ఎస్పీ దంపతులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలను జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం వివిధ పోలీస్ స్టేషన్ ల నుండి మహిళ పోలీసులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, పోలీసు అధికారులు, మహిళా సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ముందుగా బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందరితో కలిసి ఎస్పీ బతుకమ్మ సంబరాలలో బాగంగా ఉత్సాహంగా నృత్యాలు చేసారు. చివరగా అత్యంత సుందరంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులను అందజేసి ప్రోత్సహించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందటం గొప్ప విషయమని తెలిపారు. పోలీసుల కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం ఇంతమంది కుటుంబ సభ్యులను కలిసినందుకు ఆనందంగా ఉందని అన్నారు. బతుకమ్మలను పేర్చి ఆడుతూ, ఐక్యత, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, మహిళ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.