17 April, 2026 | 11:03 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రశాంత జీవనం లభిస్తుంది

21-06-2025 11:44 PM

అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి..

జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు..

కామారెడ్డి (విజయక్రాంతి): యోగాతో మానసిక, ఆరోగ్యం ప్రశాంతత లభిస్తుందని అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి(Additional SP Narasimha Reddy) అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ప్రపంచ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం పరేడ్ మైదానంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ... మొదటగా సిబ్బందికి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు.

అతి చిన్న వయసులోనే రోగాలకు గురవుతూ ప్రమాద పరిస్థితులు నెలకొంటున్నయన్నారు. నేటి పరిస్థితుల్లో యోగా, సూర్య నమస్కారాలు, నడక వంటివి మన దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగ అనేది వయసుకు సంబంధం లేకుండా అందరూ చేసే ఒక సాధనమని పేర్కొంటూ, యోగా వల్ల, ఆసనాల వల్ల అనారోగ్య బారిన పడకుండా, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసులు రేయింబవళ్లు 24 గంటలు విధులను నిర్వర్తిస్తుంటారని వారికి యోగ ఎంతగానో తోడ్పాటు అందజేస్తుందని అన్నారు, ఆరోగ్యాన్ని కాపాడుతూ విధులను నిర్వర్తించాలని సూచించారు. యోగ ప్రాణాయామము, ఆసనాలు వలన మానసిక, శరీరక విశ్రాంతి, ఉపశమనం లభించి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.

గుండెకు, శరీరానికి, మనసుకు అన్నిటికీ యోగ ఉత్తమమైన మార్గమని తెలిపారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు పోలీస్టేషనలలో అధికారులు, సిబ్బంది యోగా దినోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు.  పోలీసు అధికారులు,సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందగలరని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ అరగంట,గంట పాటు యోగా చేస్తే చాలా వరకూ అనారోగ్యం పాలుకాకుండా ఒత్తిడి వంటివి లేకుండా ప్రశాంత జీవనం సొంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరపయ్య, సిఐలు శ్రీనివాస్, మురళి, శ్రీధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.