14 July, 2026 | 6:50 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •  

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యం

04-09-2025 09:55 PM

మేడిపల్లి (విజయక్రాంతి): వాకింగ్ కోసం బయటికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ మున్సిపల్ పరిధి ఆర్ఎంఎస్ కాలనీకి చెందిన కృష్ణయ్య తన తల్లిదండ్రులతో కొంతకాలం నుండి నివాసం ఉంటున్నాడు. తన తండ్రి జంగయ్య(70) బుధవారం ఉదయం వాకింగ్ కోసం బయటికి వెళ్లి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికిన సమాచారం తెలియకపోవడంతో కృష్ణయ్య మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇట్టి వ్యక్తి కనిపిస్తే మేడిపల్లి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.