04-09-2025 09:57:42 PM
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు నియోజకవర్గం(Chennur Constituency) యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పట్టణానికి చెందిన కుదురుపాక రంజిత్ ను నియమిస్తూ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ, సోషల్ మీడియా యువజన కాంగ్రెస్ కోఆర్డినేటర్ గా నియమించినందుకు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, పిసీసీ సభ్యులు నూకల రమేష్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై జిల్లా కాంగ్రెస్ అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.