05-08-2025 12:15:02 AM
మహబూబాబాద్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్లో తూళ్ల ప్రభాకర్ (35) అనే వ్యక్తిని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. లెనిన్ నగర్ లో ప్రభాకర్ రోడ్డుపై పడుకుని ఉండగా తెల్లవారి సరికి రక్తపు మడుగులో ఉండడాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలతో జరిగి ఉంటుందా లేదా మరి ఏదైనా కారణం ఉంటుందా అనే కోణంలో విచారణ చేపట్టారు.