05-08-2025 12:16:03 AM
స్ఫూర్తి మ్యూజిక్, డాన్స్ అకాడమీ డైరెక్టర్ ఇ.సూర్యతేజ సుభ్రాంత్
ముషీరాబాద్, ఆగస్టు 4(విజయక్రాంతి): 15 ఆగష్టు 2025 స్వాతంత్ర దినోత్సవము శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ భారతీయునిలో దేశ భక్తిని, గౌరవాన్ని పెంపొందించాలనే సదుద్దేశ్యంతో గాయని గాయకుల్లో, నృత్య కళాకారులలో, దాగి వున్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించుట కొరకు ‘స్ఫూర్తి మ్యూజిక్, డాన్స్ అకాడమీ’ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆగ స్టు10న బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దేశ భక్తిగీతాలు, దేశభక్తి నృత్యాలు, దేశ నాయకుల వేషాధారణ, కవితల సం బురాలు నిర్వహిస్తున్నట్లు ‘స్ఫూర్తి మ్యూజిక్, డాన్స్ అకాడమీ’ మాస్టర్ డైరెక్టర్, టీవీ కోరియోగ్రాఫర్ సూర్యతేజ సుభ్రాంత్ సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందజేయ బడుతుంద న్నారు. విరాలకు 9652347207 నంబర్‌లో సంప్రదించాలని అన్నారు.