5 August, 2026 | 7:51 AM

ఎర్రగడ్డలో వ్యక్తి అదృశ్యం

03-09-2025 12:00 AM

సనత్‌నగర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : ఎర్రగడ్డలోని వాసవి బ్రుందావనానికి చెందిన జి. ప్రదీప్ (43) అనే వ్యక్తి అదృశ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పదీప్ (తండ్రి: నాగేశ్వరరావు), ప్రైవేట్ ఉద్యో గం చేస్తున్నాడు. ఆగస్టు 20న సంజీవ్ రెడ్డి నగర్లో నివసించే తన మేనమామ కుమారుడు శ్రీరామ్ ఇంటికి వచ్చిన ప్రదీప్, అక్కడ రాత్రి బస చేశాడు. మరుసటి రోజు (ఆగస్టు 21న) ఉదయం 11 గంటల సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు.

అతను అప్పుల సమస్యల కారణంగా ఇంటిని వదిలి వెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 683/2025 కింద మిస్సింగ్ కేసు నమోదు చేశారు.సంజీవ్ రెడ్డి నగర్ పోలీసులు అతని కోసం గాలింపులు ముమ్మరం చేశారు. ఎవరైనా ప్రదీప్ గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.