20-08-2025 01:45:36 PM
హైదరాబాద్: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు(Ranga Reddy District Court) బుధవారం జీవిత ఖైదు విధించింది. 2022లో బాలికపై అత్యాచారం చేసి అరెస్టయిన నిందితుడు ఆటో డ్రైవర్ షేక్ సలీమ్.. తాజాగా నిందితునికి కోర్టు జీవిత ఖైదుతో సహా రూ. 55000 జరిమానాను విధించింది. అలాగే బాధితురాలికి రూ. 5 లక్షలు పరిహారాన్ని కోర్టు జడ్జి మంజూరు చేశారు.